Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’తో మళ్లీ సందడి!

Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి నటిస్తున్న ‘సతీ లీలావతి’ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. దేవ్ మోహన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
లావణ్య త్రిపాఠి మరోసారి తన నటనా సత్తాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘సతీ లీలావతి’ సినిమాతో ఆమె సరికొత్త పాత్రలో మెరవనున్నారు. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకుడు. భీమిలి కబడ్డీ జట్టు, శివ మనసులో శృతి లాంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన ఈసారి భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కిస్తున్నారు.
మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. మిక్కీ జే. మేయర్ సంగీతం, బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ, సతీష్ సూర్య ఎడిటింగ్తో ఈ చిత్రం అద్భుత విజువల్ అనుభవాన్ని అందించనుంది. భర్త-భార్యల అనుబంధాన్ని హృద్యంగా చూపిస్తూ, వినోదంతో పాటు భావోద్వేగాలను మేళవించే ఈ చిత్రం 2025 సమ్మర్లో విడుదల కానుంది.