సినిమా

కాజల్ కొత్త అడుగు: దర్శకత్వంలోకి ఎంట్రీ?

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ సినీ ప్రయాణంలో సరికొత్త మలుపు! హీరోయిన్‌గా ఆకట్టుకుంటూనే, ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలు తీసుకోనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కాజల్ అగర్వాల్ సినీ రంగంలో మరో అడుగు ముందుకేస్తోంది. హీరోయిన్‌గా ఎన్నో విజయాలు అందుకున్న ఈ అమ్మడు, ఇప్పుడు దర్శకత్వంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. తన స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో కాజల్ స్వయంగా ప్రధాన పాత్రలో నటించనుంది. భగవంత్ కేసరి వంటి హిట్ సినిమాల్లో నటించినా, ఆ క్రెడిట్ ఎక్కువగా ఇతరులకే దక్కడంతో, ఈసారి తన సత్తాను దర్శకురాలిగా చాటాలని కాజల్ భావిస్తోంది.

ప్రస్తుతం మంచు విష్ణుతో కన్నప్ప, కమల్ హాసన్‌తో ఇండియన్-3, రామాయణం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న కాజల్, నటనకు స్వస్తి చెప్పకుండానే దర్శకత్వంలోకి అడుగుపెట్టడం విశేషం. త్వరలో ఓ బోల్డ్ పాత్రలో కనిపించనున్న కాజల్, ఈ కొత్త ప్రయాణంతో అభిమానులను అలరించనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button