CP CV Anand: స్టూడెంట్స్ సేఫ్టీపై సీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు

CP CV Anand: సీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు చేశారు. స్టూడెంట్ సేఫ్టీపై స్కూల్ మేనేజ్మెంట్, స్టేక్ హోల్డర్స్‌తో మీటింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే ఈ అవగాహన సదస్సు పిల్లల సేఫ్టీకి ఉపయోగపడుతుందన్నారు. పిల్లల భద్రతపై సిబ్బంది, స్కూల్ మేనేజ్మెంట్, మీడియా, తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గతేడాది 8 మంది పిల్లలు రోడ్ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయారన్నారు.
స్కూల్ మేనేజ్‌మెంట్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ట్రాన్స్‌పోర్ట్‌పై మేనేజ్‌మెంట్ తగిన చర్యలు తీసుకోవాలని సీపీ అన్నారు. స్కూల్ బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అప్పుడే రోడ్డుపై ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు.
ప్రతి రోజు ఆటోలో ఓవర్ లోడ్‌తో పిల్లలను ఎక్కించుకుని వెళ్తున్నారని అది తల్లిదండ్రులు గమనించాలని కోరారు. ఇక అబిడ్స్, సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ సేఫ్టీ ప్రమాణాలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.