ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్

కాసేపట్లో వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడకు తీసుకురానున్నారు సిట్ అధికారులు. నిన్న బెంగళూరు ఎయిర్ పోర్టులో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. అంతకుముందు లుకౌట్ నోటీసులు జారీ చేయగా బెంగళూరు ఎయిర్ పోర్టులో చెవిరెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డగించారు.

అనంతరం అక్కడకు చేరుకున్న సిట్ అధికారులు చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చెవిరెడ్డిని విజయవాడకు తరలిస్తున్నారు. మద్యం కేసులో ఏ38గా ఉన్న చెవిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button