నటి కల్పిక హంగామా.. పోలీస్ కేసు నమోదు!

Kalpika: హైదరాబాద్‌లోని ప్రిజం పబ్‌లో నటి కల్పిక సృష్టించిన రచ్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అర్ధరాత్రి పబ్‌లో హంగామా చేసిన ఆమె సిబ్బందితో పాటు పోలీసులపైనా దురుసుగా ప్రవర్తించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రిజం పబ్‌లో గత నెల 29న రాత్రి జరిగిన ఘటన సినీ వర్గాల్లో కలకలం రేపింది. నటి కల్పిక పబ్‌లో అర్ధరాత్రి కాంప్లిమెంటరీ డ్రింక్స్ కోసం సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. ఆమె అసభ్య ప్రవర్తన, గ్లాసులు, ప్లేట్లతో సహా ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై కూడా కల్పిక దూషణలు కురిపించింది. దీంతో కోర్టు అనుమతితో ఆమెపై బీఎన్ఎస్ సెక్షన్లు 324(4), 352, 351(2) కింద కేసు నమోదైంది. సినీ రంగంలో మంచి గుర్తింపు సంపాదించిన కల్పికపై ఇలాంటి ఆరోపణలు రావడం షాకింగ్‌గా మారింది. పోలీసులు ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణలో ఏ నిజాలు బయటపడతాయనేది ఆసక్తికరంగా మారింది.



