తెలంగాణ
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో మాంగళ్య షాపింగ్ మాల్ సీజ్

Hyderabad: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిర్మితమైన మాంగళ్య షాపింగ్ మాల్ అక్రమ నిర్మాణాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. సుమారు 8 నెలల క్రితం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే మాల్‌ను ప్రారంభించగా, ప్రారంభోత్సవానికి సినీ నటి హాజరయ్యారు. ఈ వ్యవహారంపై గతంలో అనేకసార్లు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసినా మాల్ యాజమాన్యం స్పందించకపోవడంతో చివరికి చర్యకు దిగారు.
మాంగళ్య షాపింగ్ మాల్‌ను అధికారులు సీజ్ చేశారు. ఈ అకస్మాత్తు చర్యతో మాల్లో పని చేస్తున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. సీజ్ వల్ల తమ ఉద్యోగాలపై ముప్పు పొంచి ఉందంటూ సుమారు 100 నుంచి 150 మంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.