సినిమా

Gaddar Awards 2025: గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్.. ఉత్తమ చిత్రం కల్కి

Gaddar Awards 2025: తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ ఛైర్‌పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1,248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు.

14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రకటించారు. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి, 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ఇచ్చారు. తెలుగు చిత్రాలతోపాటు ఉర్దూ చిత్రాల కూ అవార్డుల్లో ప్రాధాన్యతనిచ్చారు.

ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత, స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇచ్చారు. వీటితో పాటు ఎన్టీఆర్, పైడి జయరాజ్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో ప్రత్యేక అవార్డులు ప్రకటించారు.

2024 గద్దర్ సినిమా అవార్డులు ప్రకటన
ఉత్తమ చిత్రం- కల్కి2898
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ – పొట్టేల్
మూడో ఉత్తమ చిత్రం – లక్కీ భాస్కర్‌
బెస్ట్ డైరెక్టర్‌గా – నాగ అశ్విన్(కల్కి)
బెస్ట్ యాక్టర్ – అల్లు అర్జున్(పుష్ప-2)
బెస్ట్ హీరోయిన్ – నివేదా థామస్ (35)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – ఎస్.జే. సూర్య
ఉత్తమ గాయని – శ్రేయా ఘోషల్(పుష్ప-2)
స్పెషల్ జ్యూరీ అవార్డు -దుల్కర్ సల్మాన్(లక్కీ భాస్కర్)
ఉత్తమ స్క్రీన్ ప్లే- వెంకి అట్లూరి(లక్కీ భాస్కర్)

2024 గద్దర్ సినిమా అవార్డులు ప్రకటన
బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్- యధువంశీ(కమిటీ కుర్రాళ్లు)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం – ఐ అండ్ మై ఫ్రెండ్స్
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్- చంద్రశేఖర్
ఉత్తమ నృత్య దర్శకుడు – గణేశ్ ఆచార్య(దేవర)
బెస్ట్ కమెడియన్స్ – సత్య, వెన్నెల కిశోర్
ఉత్తమ గీత రచయిత – చంద్రబోస్
రజాకార్ చిత్రానికి ఫీచర్ హెరిటేజ్ అవార్డు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button