సినిమా

శ్రీ విష్ణు ‘సింగిల్’ హిట్.. ఆర్మీకి విరాళం

Single: టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ బాక్సాఫీస్‌లో సందడి చేస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ నేడు గ్రాండ్ రిలీజ్ అయ్యింది.

దర్శకుడు కార్తిక్ రాజు తెరకెక్కించిన ‘సింగిల్’లో శ్రీ విష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా మెరిశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ సినిమా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా చెబుతున్నారు.

నిర్మాత అల్లు అరవింద్ సినిమా లాభాల్లో కొంత భాగాన్ని ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నవ్వులు పూయిస్తే, విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకు బలం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button