తెలంగాణ
కూతురు ప్రేమ వివాహం నచ్చక… యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన అమ్మాయి పేరెంట్స్

సంగారెడ్డి జిల్లా ఝరా సంఘం మండలం కక్కరవాడ గ్రామంలో ప్రేమ వివాహం ఉద్రిక్తతలు రేకెత్తిస్తోంది. వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన అబ్బాయి అమ్మాయి 10 రోజుల క్రితం పెళ్లి చేసుకుని ఊరు విడిచివెళ్లిపోయారు. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు.. అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టారు. అగ్నిమాపకశాఖ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి తండ్రిపై దాడి చేశారు.



