తెలంగాణ
నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా.. హాజరుకానున్న కేటీఆర్

నల్గొండ గులాబీమయంగా మారింది. రైతు మహాధర్నా కోసం బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ జరగనున్న మహా ధర్నాకు కేటీఆర్ హాజరుకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు వరకు ధర్నా నిర్వహించుకోవాలని.. హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో.. సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.