సినిమా

Jr NTR: షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు ప్రమాదం

Jr NTR: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లో జరుగుతున్న ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, చికిత్స చేసిన వైద్యులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించినట్టుగా తెలుస్తోంది.

ఈ వార్త బయటకు రావడంతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని కోరుతూ అనేక కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button