సినిమా

రణబీర్‌ vs రజనీకాంత్‌

Rajinikanth vs Ranbir: రణబీర్‌ కపూర్‌ ‘లవ్‌ అండ్‌ వార్‌’, రజనీకాంత్‌ ‘జైలర్‌ 2’ చిత్రాలు జూన్‌లో విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాల మధ్య భారీ పోటీ నెలకొంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

బాలీవుడ్‌ స్టార్‌ రణబీర్‌ కపూర్‌ నటిస్తున్న ‘లవ్‌ అండ్‌ వార్‌’, కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘జైలర్‌ 2’ చిత్రాలు జూన్‌ చివరి వారంలో విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాల మధ్య భారీ ఢీ ఏర్పడనుంది. రణబీర్‌ గతంలో ‘అనిమల్‌’తో బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించారు. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్‌ అండ్‌ వార్‌’ మొదట మార్చి 19న విడుదలకు ప్లాన్‌ చేసినా, షూటింగ్‌ ఆలస్యం కారణంగా జూన్‌కు వాయిదా పడింది.

మరోవైపు ‘జైలర్‌’ మొదటి భాగం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ‘జైలర్‌ 2’పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ చిత్రం కోలీవుడ్‌లో తొలి 1000 కోట్ల సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మొత్తానికి ఈ రెండు చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో రికార్డు ఓపెనింగ్స్‌ సాధించే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button