ఆంధ్ర ప్రదేశ్

నేడు ఏపీలో మెగా డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల

Mega DSC: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ-2025 రాసిన వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది. అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెరిట్ జాబితాను నేడు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఇప్పటికే టెట్ మార్కుల సవరణ, స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా రూపకల్పన వంటి ప్రక్రియలు పూర్తయిన నేపథ్యంలో, తుది మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మెరిట్ జాబితాను డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఆయా జిల్లాల డీఈఓ వెబ్‌సైట్లలో కూడా అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు కేవలం ఈ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే సమాచారాన్ని పొందాలని ఆయన సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button