News
Aghori Arrest: యూపీలో అఘోరీ అరెస్ట్

Aghori Arrest: యూపీలో అఘోరీని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్లోని నార్సింగీ పీఎస్కు తరలించారు. చీటింగ్ కేసులో అఘోరీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం జైల్లోనే అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ఉన్నాడు. పూజల పేరుతో ఓ మహిళను మోసగించిన కేసులో మోకిల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. మరోవైపు వర్షిణిని కూడా హైదరాబాద్కి పో లీసులు తీసుకొస్తున్నట్లు టాక్ వినబడుతోంది.
అయితే ఈ విషయాన్ని మోకిల పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు. ఓ పుణ్యక్షేత్రం వద్ద పూజలు నిర్వహించేందుకు అఘోరిని సంప్రదించారు శంకర్పల్లికి చెందిన వినితా భాటీ. ఇక ఒప్పందం ప్రకారం 9లక్షల 80వేల రూపాయలు ఇచ్చారు వినితా భాటీ. అయితే అఘోరీ మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వినితా భాటీ.