News
జాతీయ రహదారిపై దట్టమైన పొగ మంచు.. వాహనదారుల ఇబ్బందులు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు వద్ద ముంబై జాతీయ రహదారిపై పొగ మంచు కప్పేసింది. ఉదయం నుంచి అధికంగా కురుస్తున్న పొగమంచుతో ప్రజలు బయటికి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై పూర్తిగా పొగమంచు ప్రభావం కనిపించడంతో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు రోడ్డు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటలైనా పొగ మంచు తగ్గకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకునే ప్రయాణించవలసి పరిస్థితి ఏర్పడింది . గ్రామాల సైతం పొగ మంచు కప్పేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది.