సినిమా

Sreeleela: ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్న శ్రీలీల!

Sreeleela: యువ హీరోయిన్ శ్రీలీల నిజ జీవితంలో చూపిన దయాగుణం అందరినీ ఆకట్టుకుంటోంది. కేవలం 24 ఏళ్ల వయసులోనే ముగ్గురు దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె స్పందన కూడా ఎమోషనల్‌గా ఉంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

శ్రీలీల వెండితెరపై నటన, నృత్యంతో ప్రేక్షకులను అలరిస్తూనే నిజ జీవితంలో సేవాగుణంతో మనసు గెలుచుకుంటున్నారు. 2022లో గురు, శోభిత అనే ఇద్దరు దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకున్న ఆమె, 2025 ఏప్రిల్‌లో మరో చిన్నారిని కుటుంబంలోకి ఆహ్వానించారు. కేవలం 24 ఏళ్ల వయసులోనే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయం. తన తొలి చిత్రం ‘కిస్’ షూటింగ్ సమయంలో ఆశ్రమానికి వెళ్లినప్పుడు పిల్లలతో ఏర్పడిన అనుబంధమే ఈ గొప్ప నిర్ణయానికి కారణమని శ్రీలీల వెల్లడించారు.

‘వారి గురించి మాట్లాడేటప్పుడు మాటలు రావు, చాలా ఎమోషనల్ అవుతాను. నేను వారికి సాధారణ అమ్మను, మా మధ్య ప్రత్యేక బంధం ఉంది’ అని చెప్పారు. ఈ విషయాన్ని ఇన్నాళ్లు రహస్యంగా ఉంచినప్పటికీ, సంస్థ నిర్వాహకుల కోరిక మేరకు ఇతరులను ప్రేరేపించేందుకు బయటపెట్టినట్లు తెలిపారు. బిజీ షెడ్యూల్ మధ్యలో తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీలీల నిజంగా అభినందనీయురాలనే చెప్పాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button