తెలంగాణ
Ponnam Prabhakar: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం సూచనలు

Ponnam Prabhakar: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నీటిని పొదుపుగా వాడుకుంటే రాబోయే తరాలకు అవకాశం ఇవ్వొచ్చన్నారు.
అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఇబ్బందులకు గురి కావొద్దన్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ తీసుకుంటున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలన్నారు. అందరూ నీటిని పొదుపు చేసే చర్యలు తీసుకోవాలన్నారు పొన్నం.