ఆంధ్ర ప్రదేశ్
Vikarabad: మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం

Vikarabad: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. వహీద్ అనే యువకుడు మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి ఓ వెంచర్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరికైనా చెబుతే వీడియోలు బయటపెడతానని కీచకుడు బెదిరింపులకు దిగారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ ఘటన మొమిన్‌పేట్ మండలం కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.



