తెలంగాణ
Hyderabad: ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్‌లో సోదాలు

Hyderabad: హైదరాబాద్ సనత్ నగర్ పీఎస్‌లో ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్‌లో సోదాలు చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు అమ్మాయిలతో.. నృత్యాలు చేయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో.. తనిఖీలు చేపట్టారు.
11 మంది యువతులు, ఇద్దరు డీజే నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. పోలీసుల తనిఖీల సమయంలో రెస్టారెంట్ నిర్వాహకులు పరారయ్యారు. ఎవర్ గ్రీన్ బార్ యజమాని కృష్ణంరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.