తెలంగాణ
నేడు ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ జిల్లాలో జరగనున్న ప్రజాపాలన విజయోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైంది.



