Retro Movie: రెట్రో నుంచి మరో సూపర్ సాంగ్ విడుదల

Retro Movie: సూర్య ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ‘రెట్రో’ ఒకటి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా జోజు జార్జ్, జయరామ్, నాసర్, ప్రకాష్ రాజ్, కరుణాకరన్, విద్యా శంకర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో నటి శ్రియా శరణ్ ప్రత్యేక పాటలో కనిపించనుంది. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, 2D ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల కానుంది. కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు టాలీవుడ్లో ‘రెట్రో’ని రిలీజ్ చేస్తున్నారు.
ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాలతో రూపొందించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా, ఈ మూవీ సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ మూవీ నుండి విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ ఎంతో ఆకట్టుకోగా తాజాగా ఈ మూవీ నుండి ‘కనిమా..’ అనే మరో పాట విడుదల అయ్యింది. సంతోశ్ నారాయణన్ స్వరపరిచిన ఈ గీతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. అదిరిపోయే స్టెప్పులతో సూర్య, పూజా ఎంతగానో ఆకట్టుకున్నారు.