తెలంగాణ

Malla Reddy: నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలోనే లేడని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు

Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి దంపతుల 49 వ వివాహ వార్షికోత్సవం బోయిన్ పల్లిలోని నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి,కల్పన దంపతులు నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు.వివాహ వార్షికోత్సవం సందర్భంగా మల్లారెడ్డి దంపతులు కేక్ కట్ చేశారు.మేడ్చల్ నియోజకవర్గం నుండి కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని మల్లారెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి వారిపై పూల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ తన సతీమణి కల్పన సహకారంతోనే ఉన్నత స్థాయికి చేరుకున్నానని వెల్లడించారు. ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుందని నానుడి ఎంత నిజమో నా వెనక నా సతీమణి సహకారం కూడా అంతే ఉందని అన్నారు. 49 సంవత్సరాలలో అనేక విద్యాసంస్థలు నెలకొల్పి వ్యాపారాలు చేసి ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. రాబోయే రోజులలో ప్రజలకు మరిన్ని సేవలు చేస్తూ ప్రపంచ స్థాయి ఇంజనీర్లు, డాక్టర్లను తయారు చేస్తానని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button