సినిమా
Manchu Manoj: లక్ష్మి-మనోజ్ ఎమోషనల్ వీడియో వైరల్

Manchu Manoj: మంచు కుటుంబం మళ్లీ వార్తల్లో నిలిచింది. విష్ణు-మనోజ్ మధ్య వివాదం ఇంకా చల్లారలేదనే చర్చ సాగుతోంది. ఆస్తుల పంపకంపైనే గొడవలు మొదలయ్యాయని ఒకవైపు టాక్ వినిపిస్తుండగా, అదంతా అబద్ధమంటూ మనోజ్ క్లారిటీ ఇస్తున్నారు. అయితే, ఈ వివాదాల మధ్య మంచు లక్ష్మి-మనోజ్‌ల మధుర క్షణాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ‘టీచ్ ఫర్ ఛేంజ్’ కార్యక్రమం నిన్న రాత్రి జరిగింది. ఈ ఈవెంట్లో సర్ప్రైజ్గా హాజరైన మనోజ్‌ను చూసి లక్ష్మి ఎమోషనల్ అయ్యారు.
సోదరుడిని ఆప్యాయంగా హత్తుకుని ఆనంద భాష్పాలు రాల్చారు. ఈ హృదయస్పర్శి క్షణాల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంచు కుటుంబంలో గొడవల గురించి నెటిజన్లు ఎన్ని చర్చలు చేసినా, ఈ వీడియో మాత్రం సోదర బంధానికి అద్దం పడుతోంది.