సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామున తిరుమల ఆలయానికి చేరుకున్న ఆమె సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయ సిబ్బంది ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనం పూర్తిచేసుకుని ఆలయం వెలుపలకు వచ్చిన మీనాక్షి చౌదరిని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. పలువురు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు.



