జాతియం
యువకుడిపై చేయి చేసుకున్న ఢిల్లీ మంత్రి

ఢిల్లీలో పీడబ్ల్యూడీ మంత్రి పర్వేశ్ వర్మ ఓ యువకుడిపై చేయిచేసుకున్న ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. పశ్చిమ ఢిల్లీలోని తిలక్‌నగర్‌లో రోడ్డు నాణ్యతను పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడు తన ఫోన్‌లో వీడియో తీస్తుండగా మంత్రి అతడి ఫోన్ లాక్కొని చెంపపై కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఘటనపై యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరోవైపు తన కుటుంబాన్ని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించడంతోనే ఆవేశంలో స్పందించానని మంత్రి పర్వేశ్ వర్మ వివరణ ఇచ్చారు. ఘటనపై ఆప్, బీజేపీ నేతల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.



