ఆంధ్ర ప్రదేశ్
కూటమి సర్కార్‌పై వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం

తిరుపతిలో రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అన్నమయ్య జిల్లాలో ప్రతిపాదించిన పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 10వేల 300 కోట్లతో ప్రాజెక్ట్ ఏర్పాటు, మూడు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి, జీవో జారీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు అకస్మాత్తుగా ప్రాజెక్ట్‌ను ఎందుకు రద్దు చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పర్యావరణ, టైగర్ జోన్ సెన్సిటివ్ ప్రాంతం అనే కారణాలతో రద్దు చేసినప్పుడు.. తొలుత అనుమతులు ఇచ్చే సమయంలో ఈ అంశాలు ప్రభుత్వానికి తెలియవా అని ప్రశ్నించారు.



