ఆంధ్ర ప్రదేశ్
Kollu Ravindra:పేర్ని నాని చిల్లర రాజకీయాలు మానుకోవాలి

Kollu Ravindra: పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బందరు అభివృద్ధిని అడ్డుకునేలా రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ కృషితో మచిలీపట్నానికి 8 వేల కోట్ల గోవా షిప్‌యార్డ్ ప్రాజెక్ట్ రాబోతోందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌తో సుమారు 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
బందరు పోర్టు పనులను వేగవంతం చేశామని, 2027 మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. పోర్టుకు అనుబంధంగా మరిన్ని పరిశ్రమలను తీసుకొచ్చి మచిలీపట్నం అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.



