తెలంగాణ
హైదరాబాద్‌లోని రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

హైదరాబాద్‌లోని రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు. రెస్టారెంట్లు, బేకరీలు, తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేశారు. భారీగా కల్తీ ఆహారం, కుళ్లిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. స్టోరేజ్ ఏరియాలో బొద్దింకలు, పురుగులు కనిపించాయి. రెస్టారెంట్లలోని ఫ్రీజర్లలో ఫంగస్ పేరుకుపోయినట్లు గుర్తించారు.
అంతెర కిచెన్ అండ్ బార్‌లో భారీగా కుళ్లిపోయిన పదార్థాలు గుర్తించారు. బహార్ కేఫ్‌లో అపరిశుభ్రమైన పరిస్థితులు ఉన్నాయి. ది స్పైస్ కిచెన్ వంటగదిలో బొద్దింకలు కనిపించాయి. నగరంలో భారీగా కల్తీ పన్నీర్ దందా జరుగుతున్నట్లు గుర్తించారు. నాణ్యతా ప్రమాణాలు లేకుండా చాక్లెట్ల తయారీ చేస్తున్నట్లు గుర్తించారు.



