ఓల్డేజ్ గెటప్ సీన్స్‌తో ‘రాజా సాబ్’కి మాస్ రెస్పాన్స్!

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చిత్రంలో కొత్తగా జోడించిన ఓల్డేజ్ గెటప్ సీక్వెన్స్‌లకు థియేటర్లలో అభిమానుల నుంచి భారీ అదరణ లభిస్తోంది. ఈ సీన్స్ చూసి అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీన్స్ గురించి పూర్తి వివరాలు చూద్దాం.
‘ది రాజా సాబ్’ చిత్రంలో ఓల్డేజ్ గెటప్ సీక్వెన్స్ లేకపోవడంతో అభిమానులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మేకర్స్ వెంటనే ఈ సీన్స్‌ను యాడ్ చేశారు. ఇప్పుడు థియేటర్లలో ఈ కొత్త సీక్వెన్స్‌కు మాస్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు ఈ సీన్స్ చూసి ఆనందాన్ని పంచుకుంటున్నారు. సీక్వెన్స్ కాన్సెప్ట్, దర్శకుడు మారుతి టేకింగ్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయని అందరూ మెచ్చుకుంటున్నారు.
ఈ ఓల్డేజ్ గెటప్ సీన్స్ డే వన్ నుంచే చిత్రంలో ఉంటే సినిమా మరింత బాగుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం మంచి బజ్‌తో సాగుతోంది. అభిమానులు ఈ మ్యాడ్ సీక్వెన్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం నుంచి మరింత కలెక్షన్లు రాబోతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.



