సినిమా

ఆకట్టుకుంటున్న శ్రీదేవి తమిళ చిత్రం ఫస్ట్‌లుక్‌!

తెలుగు చిత్రం ‘కోర్ట్’తో రాత్రికిరాత్రి స్టార్‌ అయిన తెలుగమ్మాయి శ్రీదేవి తమిళంలోనూ అడుగుపెడుతోంది. ఆమె తొలి తమిళ సినిమా ‘హైకూ’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇటీవల విడుదలైంది. యూత్‌ఫుల్‌ కాలేజీ లవ్‌స్టోరీగా ఈ సినిమా రాబోతుంది.

‘కోర్ట్’ సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటి శ్రీదేవి తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఆమె తొలి తమిళ చిత్రం ‘హైకూ . ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ నటుడు ఏగన్‌ హీరోగా నటిస్తున్నాడు. తెలుగు సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ యువతను ఆకర్షిస్తోంది.

ఈ సినిమా కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమకథగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ నేపథ్యంలో ‘బ్యాండ్ మేళం’ అనే చిత్రంలో రోషన్‌తో జోడీ కడుతున్న శ్రీదేవి తమిళంలోనూ అదే ఊపుతో రాణిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘కోర్ట్’లో ఆమె నటనకు వచ్చిన ప్రశంసలు తమిళ ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తాయన్న నమ్మకం వ్యక్తమవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button