సినిమా
రవితేజ సినిమా షూటింగ్‌కు బ్రేక్

అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివనిర్వాన దర్శకత్వంలో రవితేజ సినిమా షూటింగ్ జరుగుతుంది. 20 రోజుల షెడ్యూల్ నిమిత్తం మోతుగూడెం, పోల్లూరు, డొంకరాయి, సీలేరు పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్‌కు సంబంధించి సెట్స్ వేశారు. అయితే మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఐదు రోజులకే షూటింగ్ ప్యాకప్ అయ్యింది.
ఒక నెల రోజుల వరకు మంచి ఉపాధి లభిస్తుందని ఆశించిన స్థానిక యువతకు నిరాశ ఎదురైంది. మరోవైపు మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో చింతూరు డివిజన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.



