సినిమా
Samantha: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత!

Samantha: ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు ఒక్కటయ్యారు. ఇద్దరూ ఇషాన్ ఫౌండేషన్లో నేడు అత్యంత సన్నిహిత వేడుకలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో స్టార్ నటిగా నిలిచిన సమంత రూత్ ప్రభు, ‘ఫ్యామిలీ మ్యాన్’ సీరీస్తో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ నిడిమోరు జీవిత భాగస్వాములయ్యారు. ఇద్దరూ గత కొన్ని నెలలుగా సన్నిహిత స్నేహితులుగా ఉంటూ ప్రేమలో పడ్డారు.
నేడు ఉదయం హైదరాబాద్ శివార్లలోని ఇషాన్ ఫౌండేషన్లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. సాదాసీదాగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ వేడుక పూర్తయింది. ఈ వార్త సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.



