జాతియం
కర్ణాటకలో కీలక పరిణామం.. సీఎం సిద్ధరామయ్యతో డీకే శివకుమార్ సమావేశం

కర్ణాటకలో సీఎం మార్పుపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అధిష్ఠానం సూచనతో డిప్యూటీ సీఎం శివకుమార్‌ను సీఎం సిద్దరామయ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌కు ఆహ్వానించారు. తమ ఇద్దరికీ హైకమాండ్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని, ఇద్దరూ సమావేశమై మాట్లాడుకోవాలని సూచించారట. దీంతో ఇద్దరు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌తో సీఎం మార్పుపై సష్టత వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం సీఎం సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లనున్నారు.



