Swayambhu: నిఖిల్ స్వయంభు రిలీజ్ డేట్ ఖరారు.. యాక్షన్ వీడియోతో ప్రకటన!

Swayambhu: నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభు వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. మేకర్స్ అదిరిపోయే యాక్షన్ వీడియోను విడుదల చేశారు. లెజెండరీ వారియర్ లుక్‌లో నిఖిల్ కనువిందు చేయనున్నారు.
చాలా రోజుల విరామం తర్వాత స్వయంభు సినిమా నుంచి భారీ అప్డేట్ వచ్చింది. యంగ్ హీరో నిఖిల్ కెరీర్లో అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు భరత్ కృష్ణమాచారి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అద్భుతమైన యాక్షన్ వీడియోను విడుదల చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.
సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ లెజెండరీ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ ఈ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ చూపించబోతున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటాయి.



