ఆంధ్ర ప్రదేశ్
Vijayasai Reddy: పవన్ కల్యాణ్ నాకు మంచి మిత్రుడు

Vijayasai Reddy: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడని ఆయన్ను తాను ఎప్పుడూ విమర్శించలేదని, భవిష్యత్తులో కూడా విమర్శించబోనని విజయసాయి రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో జరిగిన రెడ్డి సామాజిక భవన నిర్మాణ శంకుస్థాపనలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం విజయసాయి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తమ నాయకుడు అనాలోచిత నిర్ణయాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకున్నానని తెలిపిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో చేరడం లేదని కార్లిటీ ఇచ్చారు.



