సినిమా

Varanasi: వారణాసి గ్లింప్స్‌లో మతిపోయే సీక్రెట్స్!

Varanasi: సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి’ గ్లింప్స్ విడుదలై 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వీడియోలో రాజమౌళి దాచిపెట్టిన సూక్ష్మ వివరాలు ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పరిశీలిస్తే అనేక రహస్య సూచనలు బయటపడుతున్నాయి. అంటార్కిటికా మంచు పర్వతాలపై ఉల్కపాతం, బోట్‌లో మనుషులు ఏదో తవ్వుతున్న దృశ్యం, చిరిగిపోయిన పడవ ముక్కలు కనిపిస్తాయి. ప్రియాంకా చోప్రా ఉన్న గుహ సన్నివేశంలో నీటి ఏనుగులు, చేపలు పట్టే వ్యక్తులు, గన్ పట్టిన సైనికులు, దూరంగా కొండచరియపై మహేష్ సిల్హౌట్, కింద కపాలాల మధ్య హోమం చేస్తున్న సాధువు కనిపిస్తారు.

లంకా సీన్‌లో హనుమంతుడి తోకపై గుర్రపు బండి, చేతిలో మొత్తం వృక్షంతో యుద్ధం చేస్తున్న ఆంజనేయుడు, వానర సైన్యం వెనుక ఒకే ఆకారంలో ఉన్న పర్వత శ్రేణి, రామబాణం నుంచి వచ్చే నీలి కాంతిలో నీటి సుడిగుండం పైన తిరిగే చక్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దృశ్యాలన్నీ టైమ్ ట్రావెల్ పోర్టల్‌కు సంబంధించినవేనని అర్థమవుతోంది. రాజమౌళి మరిన్ని రహస్యాలు దాచిపెట్టారని స్పష్టమవుతుంది. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button