తెలంగాణ

ప్రముఖ కవి అందెశ్రీ అంత్యక్రియలు.. పాడె మోసిన సీఎం రేవంత్‌

ప్రముఖ కవి, రచయిత, “జయ జయహే తెలంగాణ” గీత రచయిత అందెశ్రీ కి ఘట్కేసర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై పాడె మోశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారిక లాంఛనాలతో ఆయనకు చివరి వీడ్కోలు ఇచ్చారు.

మంత్రులు శ్రీధర బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కవికి తుది వీడ్కోలు చెప్పేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, సాహిత్య ప్రేమికులు తరలివచ్చారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగానికి తీరని లోటని పలువురు నేతలు భావోద్వేగంగా పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button