ఆంధ్ర ప్రదేశ్
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

కన్న తండ్రికి కూతురు తలకొరివి పెట్టిన సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో చోటు చేసుకుంది. గెద్దనపల్లి పంచాయితీ పరిధిలోని లచ్చిరాజు చెరువు గ్రామానికి చెందిన బడుగు వెంకటరమణ(48) బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో శికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు లేకపోవడంతో తండ్రికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది కూతురు.



