నీ బరువు ఎంత ? రిపోర్టర్ ప్రశ్న.. హీరోయిన్ దిమ్మతిరిగే కౌంటర్..

Gouri Kishan: సినీ సమాజంలో నటీ మణులు, హీరోయిన్లపై, శరీరాలపై అవమానకర వ్యాఖ్యలు పరిపాటిగా మారిపోయాయి. తాజాగా తమిళ నటి గౌరీ కిషన్ శరీరాన్ని అవమానించేలా ఒక ప్రెస్మీట్లో అడిగిన ప్రశ్న ఆగ్రహ జ్వాలల్ని రగిలించింది. సినిమా ప్రమోషన్లో భాగంగా చెన్నైలో జరిగిన ప్రెస్ ఈవెంట్లో తన బరువు గురించి తమిళ యూట్యూబ్ మీడియా జర్నలిస్టు మిమ్మల్ని ఎత్తితే ఎంత బరువు ఉంటారు?’ అని అడిగిన ప్రశ్నకు గౌరీ కిషన్ తీవ్రంగా స్పందించింది.
నటిగా నా నటన గురించి అడిగాలి, సినిమా గురించి అడగాలి కానీ, నా శరీర బరువు గురించి అడగడం ఏమిటంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ప్రశ్న ఒక పురుష నటుడి బరువు గురించి అడుగుతారా అని కూడా ఆమె ప్రశ్నించింది. పైగా బరువు గురించి అడిగిన ప్రశ్న కరెక్టే అని ఒక పురుష జర్నలిస్ట్ వాదించడం దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, ఇది జర్నలిజం కాదు. వేధింపులతో సమానమని పేర్కొంది. జర్నలిస్టులు వృత్తికి అవమానం తెస్తున్నారంటూ సీరియస్ అయ్యింది.



