తెలంగాణ
BC Bandh: బీసీ బంద్‌లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

BC Bandh: బీసీ సంఘాలు తలపెట్టిన బీసీ బంద్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లా మారింది. జనగామ జిల్లాలో బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ఘర్షణతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నాయకుడు బీసీ ఓట్ల కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా ఆనడంతో వివాదం తలెత్తింది. దీంతో కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తంచేస్తూ బీఆర్ఎస్ నాయకుడిపైకి దూసుకెళ్లారు. బీసీ నాయకులు, పోలీసుల జోక్యం చేసుకోవడంతో గొడవ కాస్త సద్దుమణిగింది.



