జాతియం
Khagen Murmu: బీజేపీ ఎంపీపై దాడి.. తలకు తీవ్రగాయం

Khagen Murmu: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన ఓ బీజేపీ ఎంపీ కి షాకింగ్ అనుభవం ఎదురైంది. స్థానికుల దాడిలో సదరు ఎంపీ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చేసుకుంది. బెంగాల్లోని మాల్దాహా లోక్సభ నియోజకవర్గానికి చెందిన ఎంపీ ఖాగెన్ ముర్ము వరద ప్రభావిత జల్పైగురి ప్రాంతంలో పర్యటించారు.
స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఘోష్, ఇతర బీజేపీ నాయకులతో కలిసి వరద బాధితులకు సహాయ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారిపై స్థానికులు కొందరు దాడి చేశారు. ఈ దాడిలో ఖాగెన్ ముర్ము తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. బీజేపీ నేతలు వెంటనే ఎంపీని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ నేతల పనే అని ఆరోపించింది.



