తెలంగాణ
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నకిలీ సిగరెట్లు పట్టివేత

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నకిలీ సిగరెట్లను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ సిగరెట్లను సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 57వేల విలువ గల నకిలీ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సిగరెట్లను తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.



