సినిమా

Ileana: రెండోసారి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా!

Ileana: నటి ఇలియానా డీక్రూజ్ మరోసారి తల్లి అయ్యారు. జూన్ 19న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాబు ఫొటో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఇలియానా డీక్రూజ్ మరోసారి తల్లి అయ్యారు. జూన్ 19న మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె, తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాబు ఫొటోను షేర్ చేస్తూ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. బిడ్డకు ‘కియాను రఫే డోలన్’ అని నామకరణం చేశారు. 2023లో మైఖేల్ డోలన్‌తో వివాహం చేసుకున్న ఇలియానా, అదే ఏడాది ఆగస్టులో మొదటి బిడ్డ కోవా ఫీనిక్స్ డోలన్‌కు జన్మనిచ్చారు.

ఇప్పుడు రెండో కొడుకుతో ఆమె జీవితం మరింత సంతోషంతో నిండిపోయింది. ‘దేవదాస్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా, పోకిరి, జల్సా, జులాయి వంటి హిట్ చిత్రాలతో స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. 2018లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో తెలుగులో చివరిసారి కనిపించిన ఆమె, ఆ తర్వాత బాలీవుడ్‌లో కెరీర్‌ను కొనసాగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button