సినిమా

Kubera: కుబేర సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Kubera: టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతోన్న ‘కుబేర’ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

‘కుబేర’ చిత్రం టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రెస్టీజియస్ మూవీలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ స్టార్ కాస్ట్‌తో పాటు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చిత్రానికి మరో హైలైట్‌గా నిలుస్తోంది. థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ స్టైలిష్ పోస్టర్‌తో ప్రకటించారు.

ఈ అనౌన్స్‌మెంట్‌తో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొనగా, ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button