Pawan Kalyan: పవర్ స్టార్ ‘హరిహర వీరమల్లు’ మూడో సింగిల్ సంచలనం.. కీరవాణిని సత్కరించిన పవన్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి మూడో సింగిల్ ‘అసరుల హననం’ రిలీజ్ కానుంది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ ఎపిక్ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్ కీరవాణిని సత్కరించిన వీడియో వైరల్‌గా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిస్టారికల్ ఎపిక్ ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ వీరమల్లు పాత్రలో అదరగొట్టనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా, మూడో సింగిల్ ‘అసరుల హననం’ను మే 21న ఉదయం 11.55 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సాలిడ్ పోస్టర్‌తో ప్రకటించింది.
ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ సంగీత దర్శకుడు కీరవాణిని సత్కరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ భారీ చిత్రం పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు.