ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో సిట్ కస్టడీకి కల్తీ నెయ్యి నిందితులు

తిరుమల కల్తీ నెయ్యి నిందితులను సిట్ కస్టడీకి తీసుకున్నారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసు నిందితులు పొమిల్ జైన్, అపూర్వ వినయ్‌కాంత్ చావడాలను కోర్టు మూడు రోజుల సిట్ కస్టడీకి అప్పగించింది. ఏ3, ఏ5లను అప్పగించిన తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు ఏ3 భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్ విపిన్ జైన్, ఎ5 వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ చావడాలను ఇవాళ, రేపు, ఎల్లుండి పోలీసులు విచారించడానికి వీలుగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.