ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

Chandrababu: తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం లోపలికి వెళ్లి తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సీఎంకు వేదపండితుల ఆశీర్వచనాలు అందించారు. సీఎంకు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేసిన అర్చకులు, దేవాంశ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.