తెలంగాణ
Hyderabad: కూలిన లిఫ్ట్.. ముగ్గురికి గాయాలు

Hyderabad: హైదరాబాద్ ఆసీఫ్ నగర్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ కూలి ముగ్గురికి గాయాలయ్యాయి. ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా మొదటి అంతస్థులోకి పడిపోయింది లిఫ్ట్. ప్రమాద సమయంలో లిఫ్ట్ లో ముగ్గురు పెద్దలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పెద్దలకు తీవ్రగాయాలు కాగా చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ హాస్పిటల్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు.