ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: పోలీసులపై నారా లోకేష్ ఫైర్..

Nara Lokesh: ఏపీ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ మార్గ మధ్యలో టంగుటూరు టోల్గేట్ వద్ద కాసేపు ఆగారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఆప్యాయంగా పలకరింంచిన లోకేష్ వారి వద్ద నుంచి వినతులు స్వీకరించారు.
టంగుటూరు టోల్గేట్ వద్ద కార్యకర్తలకు కరచాలనం చేస్తూ ఉండగా.. కొందరితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారిపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అయి ఉండే మీరే ఇలా ప్రవర్తిస్తే ఎలా అని వారి పట్ల అసహనం వ్యక్తం చేశారు లోకేష్. మరోసారి ఇలా ప్రవర్తించొద్దని వారకి సూచించారు.



