తెలంగాణ

Seethakka: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన సీతక్క

Seethakka: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి సీతక్క ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను మంత్రి ఎండగట్టారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని సీతక్క విమర్శించారు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం 1200 చేసిందని, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే ప్రజలకు గ్యాస్ సిలిండర్ అందిస్తుందని తెలిపారు.

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందనన్నారు. యువతకు ఉపాధి లేకుండా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు సీతక్క. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరఫున జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్ధిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button